V6 News

ఈవీఎంలను కాదు.. ప్రజల మనసులను మోడీ హ్యాక్ చేశారు: ఎంపీ కంగనా రనౌత్

ఈవీఎంలను కాదు.. ప్రజల మనసులను మోడీ హ్యాక్ చేశారు:  ఎంపీ కంగనా రనౌత్

న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవడానికి ఓటింగ్ వ్యవస్థలను మార్పు చేయాల్సిన అవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఆయన ఈవీఎంలను కాదు, ప్రజల మనసులనే హ్యాక్ చేశారని తెలిపారు. లోక్‌‌‌‌సభలో ‘ఎన్నికల సంస్కరణలు’ అంశంపై బుధవారం జరిగిన చర్చలో కంగనా మాట్లాడుతూ..“కాంగ్రెస్ వాళ్లకి చెప్తున్నా. ప్రధాని మోదీకి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అవసరంలేదు. ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. ఓటములను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నాయి. పేపర్ బ్యాలెట్ వ్యవస్థ అనేది ఇప్పటి డిజిటల్ యుగానికి పూర్తిగా సరిపడదు. 

రాహుల్ ఈ ఏడాది మొత్తం ఈవీఎం హ్యాక్ అయిందంటూ ఒకటే మంత్రం జపించారు. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ రోజూ రొటీన్‌‌‌‌గా ఆధారాలు చూపకుండా అరిచారు. చివరికి ఆయన మాట్లాడిందల్లా ఖాదీ వస్త్రం, దారాలు, గొలుసు, షటిల్ (నేత పరికరాలు) వంటి నీతి కథలు మాత్రమే. రాహుల్  గాంధీ గాలి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్షాలు ఒక అమెరికన్ మహిళ ఫొటోను వాడారు. ఆ అమ్మాయి హర్యానాలో బీజేపీ తరపున ఓటర్లను ప్రభావితం చేసిందని ఆరోపించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలే. ఆధారాలేమీ లేకుండానే ఓ విదేశీ 
మహిళ ఎన్నికల మోసంలో భాగమైందని తప్పుడు ఆరోపణ చేశారు” అని కంగనా మండిపడ్డారు.