ఢిల్లీని గ్రాండ్​ సిటీగా మార్చడమే లక్ష్యం : ప్రధాని మోడీ

ఢిల్లీని గ్రాండ్​ సిటీగా మార్చడమే లక్ష్యం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలోని కల్కాజీలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రధాని మోడీ బుధవారం ఇండ్లను పంపిణీ చేశారు. స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కింద 3,024 ప్లాట్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడంతో లబ్ధిదారులకు మోడీ ప్లాట్లను అందజేశారు.ఫేజ్ వన్ కింద మొత్తం రూ.345 కోట్ల నిధులతో ఈ ప్లాట్లను నిర్మించారు. అర్హులైన వారికి ఇంటి తాళం అందజేసినప్పుడు వారి ముఖంలో కనిపించిన సంతోషం వెలకట్టలేనిదని మోడీ కామెంట్ చేశారు.

కేవలం ఒక్క కల్కాజీ స్లమ్ ఏరియాలోనే 3 వేలకుపైగా ప్లాట్లను నిర్మించామన్నాkaరు. అన్ని సౌకర్యాలు కల్పించి ఢిల్లీని గ్రాండ్ సిటీగా మార్చడంపై ఫోకస్ పెట్టామని మోడీ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ రాజధాని 190 కి.మీల నుంచి దాదాపు 400 కి.మీల పొడవు పెరిగిందని వెల్లడించారు. మెట్రో సేవలను విస్తృత పరిచినట్లు తెలిపారు.పేదలకు అనుకూలమైన నిర్ణయాలతో పాటు ఢిల్లీ చుట్టూ రహదారులను, అనేక సౌలతులను అభివృద్ధి చేసినట్లు వివరించారు. దిగువ, మధ్యతరగతి వర్గాల వారి హౌసింగ్ లోన్ వడ్డీలపై సబ్సిడీ ఇస్తున్నామని.. తద్వారా పేదల ఇంటి కల నేరవేరడానికి కేంద్రం సాయం చేస్తోందన్నారు. అందుకు రూ. 700 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.