గోవా ప్రజలను దారి మళ్లిస్తున్రు

గోవా ప్రజలను దారి మళ్లిస్తున్రు

పనాజి: నిరుద్యోగం, పర్యావరణం వంటి అసలు సమస్యల నుంచి గోవా ప్రజలను ప్రధాని మోడీ పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 1947లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తలచుకుంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని గంటల్లోనే పోర్చుగీసు వారి నుంచి గోవాకు కూడా విముక్తి కలిగేదని, కానీ కాంగ్రెస్ నిర్వాకం వల్ల 15 ఏండ్లు ఆలస్యంగా ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిందంటూ మోడీ గురువారం గోవాలోని మపుసాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో చేసిన కామెంట్లను రాహుల్ తప్పుపట్టారు. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం తర్వాత నెలకొన్న పరిస్థితిని ఆయన అర్థం చేసుకోలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన ఈ కామెంట్లు చేశారన్నారు. మార్గావ్​లో శుక్రవారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో నిరుద్యోగం, పర్యావరణంవంటి అంశాలే లేవన్నారు. గోవాలో కాంగ్రెస్ ఫుల్ మెజారిటీతో గెలుస్తుందన్నారు.