కాసేపట్లో తిరుమలకు ప్రధాని

కాసేపట్లో తిరుమలకు ప్రధాని

దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి తిరుమలకు వస్తున్నారు నరేంద్రమోడీ. సాయంత్రం 4.30 నిమిషాలకు… ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగుతారు. ప్రధాని మోడీకి.. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు.

ఎయిర్‌పోర్టు బయట కార్బాన్ సెల్ ఫోన్ కంపెనీ గ్రౌండ్స్ లో బీజేపీ నాయకులు ఓ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొని .. ప్రజలతో మాట్లాడతారు.

ఆ తర్వాత రోడ్డుమార్గంద్వారా తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌజ్ కు వెళ్తారు. రాత్రి 7.20 గంటలలోపు దర్శనం పూర్తి చేసుకుని తిరిగి రేణిగుంటకు చేరుకుంటారు. షెడ్యూల్ ప్రకారం.. రాత్రి 8 తర్వాత మోడీ ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

పీఎం మోడీ పర్యటన కారణంగా… తిరుమల, తిరుపతి పట్టణాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధాని వచ్చే ఘాట్ రోడ్ లో కూంబింగ్‌, బాంబు స్క్వాడ్లు తనిఖీలు చేశారు.

శ్రీలంక పర్యటన ముగించుకుని మోడీ.. తిరుమలకు నేరుగా చేరుకుంటారు. ఉదయం మాల్దీవుల పర్యటన నుంచి శ్రీలంకకు వెళ్లారు మోడీ. ఏప్రిల్ లో ఉగ్రవాద దాడుల్లో చనిపోయినవారికి చర్చిల్లో నివాళులు అర్పించారు.