టెన్నిస్​ లెజెండ్​కు మోడీ అభినందన లేఖ

టెన్నిస్​ లెజెండ్​కు మోడీ అభినందన లేఖ

న్యూఢిల్లీ: కెరీర్‌‌కు వీడ్కోలు పలికిన  టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌ సానియా మీర్జాను అభినందిస్తూ  ప్రధాని నరేంద్ర మోడీ లెటర్​ పంపించారు. ‘ఇండియా స్పోర్ట్స్‌‌పై సానియా చెరగని ముద్ర వేసింది. రాబోయే తరం అథ్లెట్లకు చాలా స్ఫూర్తిగా నిలిచింది. మీరు ఆడటం ప్రారంభించినప్పుడు ఇండియాలో టెన్నిస్‌‌ చాలా భిన్నంగా ఉంది. ఎక్కువ మంది మహిళలు టెన్నిస్‌‌లోకి వచ్చి రాణించగలరని మీ ఆటతో నిరూపించారు. స్పోర్ట్స్‌‌ను కెరీర్‌‌గా తీసుకోవాలనుకునే మహిళలకూ మీ సక్సెస్‌‌ బలాన్ని ఇచ్చింది’ అని మోడీ వ్యాఖ్యానించారు. సానియా విజయం ప్రతి ఇండియన్‌‌ హృదయాన్ని గర్వంతో నింపిందని పీఎం అన్నారు.

‘ఇండియా తరఫున మెడల్స్‌‌ గెలవడం మీకెంతో గౌరవం అన్నారు. కానీ మీరు ఇండియాకు గర్వకారణమని నేను చెప్పగలను. మీ విజయం ప్రతి ఒక్కరి మనసులను ఆనందంతో నింపింది. ఆటలో మీరు చాలా  గాయాల బారిన పడ్డారు. కానీ ఆ ఎదురుదెబ్బలు మీ సంకల్పానికి మరింత బలం చేకూర్చాయి. సవాళ్లను అధిగమించే శక్తిని ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మీరు యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రధాని వర్ణించారు.  ప్రధాని పంపిన అభినందన సందేశాన్ని ట్వీటర్‌‌లో పోస్ట్‌‌లో చేసిన సానియా.. మోడీకి థ్యాంక్స్​ చెప్పింది. ‘ఇండియా గర్వపడేలా చేయడానికి నేను శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటా’ అని ట్వీట్​ చేసింది.