మోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి

మోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో చాలా వర్గాలు అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా ఉండిపోయాయన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ మరింతగా బలపడుతోందన్నారు. అందుకే కొత్త అగ్రి చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. అగ్రి చట్టాలపై నిరసనలు చేస్తున్న రైతులతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్నదాతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు హోం మంత్రి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.