కోవిడ్ 19 పై మోడీ హై లెవల్ మీటింగ్

కోవిడ్ 19 పై మోడీ హై లెవల్ మీటింగ్

కరోనా కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ క్రమంలోనే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. కొత్త వేరియంట్ పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

* రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించాలి.
* కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలి.
* మందులు, వ్యాక్సిన్లు, హాస్పిటల్ లో బెడ్ లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. 
* అవసరమైన ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
* ఆక్సిజన్ సిలిండర్లు, PSA ప్లాంట్లు, వెంటిలేటర్లు, మానవ వనరులు సహా హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంచుకోవాలి.
* కోవిడ్ సౌకర్యాలను రాష్ట్రాలు ఆడిట్ చేయాలి.

మరోవైపు హెల్త్ ఆఫీసర్స్ తో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ సమావేశం నిర్వహించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. దేశంలో కొత్త వేరియెంట్లు వస్తుండటంతో.. అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని.... శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.