Icc ODI rankings: వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్గా మహమ్మద్ సిరాజ్

Icc ODI rankings: వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్గా మహమ్మద్ సిరాజ్

టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఇటీవల జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ వన్డే సిరీసుల్లో సత్తా చాటిన సిరాజ్, ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ కి టాప్ టెన్ లో చోటు దక్కింది. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో చెలరేగిన గిల్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకున్నాడు. 

వన్డే టాప్ టెన్ బౌలర్లలో భారత్ తరుపున కేవలం సిరాజ్ మాత్రమే ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్ టెన్ లో ముగ్గురు టీమిండియా బ్యాట్స్ మెన్లకు చోటు దక్కింది. శుభ్ మన్ గిల్ 6వ స్థానంలో, విరాట్ కోహ్లీ 7వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో నిలిచారు. తాజాగా న్యూజిలాండ్ టీంని క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో భారత్ నెగ్గితే మూడు ఫార్మాట్లలోనూ టాప్ ప్లేస్ కు చేరుకోనుంది.