అమ్మ బాగుండాలని బిక్షం ఎత్తుకున్నాడు ఓ వ్యక్తి. ఆ కథ ఆధారంగా సినిమా కూడా వచ్చింది. అలాంటి స్టోరీనే ఇది. అమ్మ కోసం ఒక 19 ఏళ్ల యువకుడు దేశమంతా పరిగెడుతున్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలను పరిగెడుతూ దర్శించుకుంటున్నాడు. ఈ యువ యాత్రికునికి అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
బీహార్ పాట్నాకు చెందిన మోను మెటురబాలా అనే యువకుడు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాడు. రన్నింగ్ చేస్తూ 12 జోతర్లింగాలు, చార్ దామ్ యాత్రకు పూనుకోడం విశేషం.
అనారోగ్యంగా ఉన్న తన తల్లి లల్తీ దేవి కోసం మొక్కుకున్న మొక్కులను తీర్చుకునేందుకే ఈ పనిచేస్తున్నట్లు చెబుతున్నాడు మోను. అమ్మ అనారోగ్యం నుంచి కోలుకుంటే 12 జ్యోతిర్లింగాలను పరిగెడుతూ దర్శించుకుంటానని మొక్కుకున్నాడంట. తన తల్లి ఆరోగ్యం కుదుట పడటంతో ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు పరుగులు పెడుతున్నాడు.
A devoted son from Bihar is redefining faith in Kalyug Pure devotion When his mother fell ill he promised Lord Shiva he’d run to all 12 Jyotirlingas if she recovered. Now that she is completely well he is running across India to fulfill his vow https://t.co/G9mkKp6Uk6
— Ramesh Speaks (@rameshofficial0) October 14, 2026
2026 మార్చి నుంచి మొదలు:
మోను తన పరుగును 2026 మార్చి 15న పాట్నా నుంచి ప్రారంభించాడు. ప్రతి రోజు 50 కిలోమీటర్లు పరిగెడతాడు. అయితే జ్యోతిర్లింగాలతో పాటు చార్ దామ్ యాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు.
పాట్నా నుంచి మొట్టమొదట జార్ఖండ్ లోని బాబా బైద్యనాథ్ ధామ్ ను దర్శించుకున్న మోను.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్ర నాషిక్ లోకి త్రయంబకేశ్వరం మొదలైన తీర్థ స్థలాలను దర్శించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని పార్లీ వైజ్ఞాత్ జ్యోతిర్లింగాన్ని కూడా ఇప్పటికే దర్శించుకున్నాడు.
బ్లాక్ పాంథర్ మోనూ..
మోనూను అందరు బ్లాక్ పాంథర్ మోనూ అని పిలుస్తున్నారు. అమ్మ కోసం మోనూ చేపట్టిన యాత్ర గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోనూ ప్రయాణించే దారులలో జనాలు నీరాజనం పడుతున్నారు. దైవ అనుగ్రహంతోనే ఇలాంటి క్లిష్టమైన యాత్ర చేస్తున్నాడని కొందరు దేవుడిలా చూస్తున్నారు. కొందరు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.
మోనూ పరిగెడుతుంటే యువత చాలా మంది అనుసరిస్తూ.. అతనితో పాటుపరిగెడుతూ తమ గ్రామాల సరిహద్దులను దాటిస్తున్నారు. ప్రతీరోజూ దాదాపు 50 కిలోమీటర్లు పరిగెట్టే మోనూ.. రాత్రుల్లో బస చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు పుణ్యం దక్కుతుంది అన్నట్లుగా విరాళాలు అందజేస్తున్నారు. మోనూకు ఇస్తే ఆ దేవుడికి ఇచ్చినట్లేనని కొందరు కానుకలు ఇస్తున్నారు. అమ్మకోసం పరుగు ప్రారంభించిన మోనూ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయాడు.
