వీవీఎస్ లక్ష్మణ్కు దక్కని అదృష్టం సిరాజ్కు దక్కేనా..?

వీవీఎస్ లక్ష్మణ్కు దక్కని అదృష్టం సిరాజ్కు దక్కేనా..?

హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లక్కీ చాన్స్ కొట్టేసాడు. ఇన్నాళ్లు టెస్టుల్లో ఆడిన అతను....ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. స్టార్ పేసర్ బుమ్రా వెన్ను నొప్పితో ఈ సిరీస్కు దూరం అయ్యాడు. దీంతో అతని ప్లేస్లో సిరాజ్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఇప్పటికే ఫస్ట్ టీ20 ముగిసిన నేపథ్యంలో..మిగతా రెండు టీ20లకు బుమ్రా స్థానంలో సిరాజ్ ఆడనున్నట్లు వెల్లడించింది. అయితే కొవిడ్ బారిన పడి కోలుకున్న మహ్మద్ షమీ పేరును కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. కానీ బీసీసీఐ మాత్రం సిరాజ్కే మద్దతు తెలిపింది.  

టీ20 వరల్డ్ కప్లో ఆడతాడా? 
హైదరాబాద్ గల్లీలో ఆడి..తన ప్రతిభతో..టీమిండియాకు ఎంపికైన సిరాజ్..వరల్డ్ కప్లో ఆడే కలకు ప్రస్తుతం అడుగుదూరంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికైన సిరాజ్ రాణిస్తే మాత్రం టీ20 వరల్డ్ కప్లో ఆడే అవకాశాన్ని అందుకోనున్నాడు.  అయితే టీ20 వరల్డ్ కప్ కోసం షమీ ఇప్పటికే స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. కొవిడ్ కారణంగా అతను ఆసీస్, సఫారీల సిరీస్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకున్నా..అతను మాత్రం కార్డియో వాస్క్యులర్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ టెస్టులో పాసైతేనే..షమీ జట్టులోకి వస్తాడు. లేకపోతే మాత్రం జట్టుకు దూరం కాక తప్పదు. 

పేస్..స్వింగ్ సిరాజ్ సొంతం..
టీ20 వరల్డ్ కప్కు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన షమీ..కార్డియో వాస్క్యులర్ టెస్ట్ పాసై ప్రధాన జట్టులోకి వస్తే మాత్రం .. సిరాజ్‌కు స్టాండ్‌బై లిస్ట్‌లో చోటు దక్కే ఛాన్సుంది. దీనికి కారణం  సిరాజ్ బౌలింగ్‌లో పేస్, స్వింగ్ ఉండటమే. ఆసీస్ పిచ్లకు అతని బౌలింగ్ శైలి కరెక్ట్గా సరిగ్గా సరిపోతుంది. సిరాజ్ ఆస్ట్రేలియా గడ్డపైనే టెస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఫస్ట్ మ్యాచ్‌లోనే 5 వికెట్లు దక్కించుకున్నాడు. అప్పుడు కూడా బుమ్రా, షమీ గాయాలతో దూరమవడంతో సిరాజ్ టెస్టుల్లోకి వచ్చాడు. 

రోహిత్ మద్దతుంటేనే..
టీ20 వరల్డ్ కప్కు సిరాజ్ ఎంపికవ్వాలంటే..కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ మద్దతు తప్పనిసరి. వీరిద్దరు ఒకే అంటేనే సిరాజ్ వరల్డ్ కప్ కల నెరవేరనుంది. అయితే రోహిత్, ద్రవిడ్ మాత్రం షమీ, ఉమేష్ యాదవ్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.  ఒక వేళ సిరాజ్ జట్టులోకి వస్తే మాత్రం..ఖచ్చితంగా తుది జట్టులో ఉండటం ఖాయం. ఇదే జరిగితే తెలుగు గడ్డ నుంచి వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్గా సిరాజ్ చరిత్ర సృష్టిస్తాడు. వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు అందుకోలేని ఘనత సాధించనున్నాడు.