రోడ్డు ప్రమాద బాధితుడిని రక్షించిన షమీ.. వీడియో వైరల్

రోడ్డు ప్రమాద బాధితుడిని రక్షించిన షమీ.. వీడియో వైరల్

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నైనిటాల్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాధితుడిని రక్షించాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అతను రోడ్డు ప్రమాద బాధితుడి కారు రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు కనిపించాడు. "అతను చాలా అదృష్టవంతుడు, దేవుడు అతనికి మరో జీవితాన్ని ఇచ్చాడు. అతని కారు నైనిటాల్ సమీపంలోని కొండ రహదారి నుండి నా కారుకు ఎదురుగా పడిపోయింది. అతడిని సురక్షితంగా తీసుకెళ్లాం' అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ముహమ్మద్ షమీ భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల తరువాత బరిలోకి దిగిన అతడు ఏకంగా 24 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే, ఫైనల్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ???????? ????? (@mdshami.11)