ICC bowling ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. సిరాజ్, ప్రసిద్ కృష్ణలకు కెరీర్ అత్యుత్తమ ర్యాంకులు

ICC bowling ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. సిరాజ్, ప్రసిద్ కృష్ణలకు కెరీర్ అత్యుత్తమ ర్యాంకులు

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టులో ఇద్దరూ కలిసి 17 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్, ప్రసిద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ నాలుగు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్ట్ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2-2 తో సిరీస్ సమం చేసింది. ఈ సిరీస్ తర్వాత సిరాజ్, ప్రసిద్ ర్యాంక్ లు మెరుగయ్యాయి. 

బుధవారం (ఆగస్ట్ 6) ఐసీసీ టెస్ట్ ర్యాంక్ లను రిలీజ్ చేసింది. సిరాజ్ 674 అత్యుత్తమ రేటింగ్‌లతో ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు 27 వ స్థానంలో ఉన్న సిరాజ్ ఒక్కసారిగా టాప్ -15లోకి చేరుకోవడం విశేషం. 386 రేటింగ్ పాయింట్లతో 84 వ స్థానంలో ఉన్న ప్రసిద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్ కు ముందు 94 వ స్థానంలో ఉన్న ప్రసిద్ సిరీస్ ముగిశాక టాప్ 60 లోకి రావడం విశేషం. జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. రబడా రెండో ర్యాంక్ లో ఉన్నాడు. 

ALSO READ : World Humanoid Robot Games: వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్.. ప్రాక్టీస్ ప్రారంభించిన చైనా

జైస్వాల్ మళ్ళీ టాప్ 5 లోకి జైశ్వాల్:
 
బ్యాటింగ్ విషయానికొస్తే, ఓవల్‌లో సెంచరీతో సత్తా చాటిన యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో మూడు స్థానాలు ఎగబాకి  టాప్-5లో తిరిగి స్థానం సంపాదించాడు. మరోవైపు చివరి టెస్టులో విఫలమైన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13 వ ర్యాంక్ కు పడిపోయాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 908 రేటింగ్ పాయింట్స్ తో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవల్ టెస్టుకు ముందు మూడో ర్యాంక్ లో ఉన్న హ్యారీ బ్రూక్ సెంచరీతో ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. రిషబ్ పంత్ 8 వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.