World Humanoid Robot Games: వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్.. ప్రాక్టీస్ ప్రారంభించిన చైనా

World Humanoid Robot Games: వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్.. ప్రాక్టీస్ ప్రారంభించిన చైనా

బీజింగ్‌లో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే మొదటి వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ కావడం విశేషం. ఈ గేమ్స్ ఆగస్టు 14 నుండి 17 మధ్య జరుగుతాయి. హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ కోసం చైనాకు చెందిన విశ్వవిద్యాలయ జట్లు రోబోట్‌లను సిద్ధం చేస్తున్నాయి. చైనాతో పాటు విదేశాల నుండి వచ్చిన ఈ AI-ఆధారిత జట్లు బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్ వేదికలో శిక్షణ పొందుతున్నాయి.

అమెరికా, బ్రెజిల్, జర్మనీ, పోర్చుగల్ వంటి దేశాల నుండి ముప్పై జట్లు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో పోటీపడతాయి. ఈ జట్లలో 5 మంది రోబో ఆటగాళ్ళు ఉంటారు. బ్రెజిల్‌లో జూన్‌లో జరిగిన రోబోకప్‌లో రన్నరప్‌గా నిలిచిన చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి షాన్హాయ్ జట్టు సోమవారం ప్రాక్టీస్ శిబిరంలో ఉంది. ప్రాక్టీస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి. "క్రీడ ద్వారా AI, రోబోటిక్స్ సరిహద్దులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా బీజింగ్‌లో జరుగుతున్న మొదటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్‌ల కోసం హ్యూమనాయిడ్ రోబోలు శిక్షణ పొందుతున్నాయి" అని రాయిటర్స్ ఎక్స్ లో షేర్ చేసింది.

ALSO READ : స్వదేశానికి బయల్దేరిన టీమిండియా హీరోలు

జూన్ 30న @TheHumanoidHub ఎక్స్ లో మరొక వీడియోను షేర్ చేసింది. "చైనా మొదటి 3-ఆన్-3 సాకర్ మ్యాచ్‌లలో నాలుగు జట్ల హ్యూమనాయిడ్ రోబోలు తలపడ్డాయి. బూస్టర్ T1 రోబోట్‌లను నాలుగు విశ్వవిద్యాలయ జట్లు పూర్తిగా స్వయంప్రతిపత్తితో ఆడటానికి ప్రోగ్రామ్ చేశాయి. ఈ కార్యక్రమం ఆగస్టులో బీజింగ్‌లో జరగనున్న రాబోయే ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌కు ప్రివ్యూగా పనిచేసింది."