Mohammed Siraj: నీళ్లు తాగించాలి, బ్యాట్ అందివ్వడమే మా పని.. టీమ్ మేనేజ్మెంట్పై సిరాజ్ సెటైర్లు

Mohammed Siraj: నీళ్లు తాగించాలి, బ్యాట్ అందివ్వడమే మా పని.. టీమ్ మేనేజ్మెంట్పై సిరాజ్ సెటైర్లు

Mohammed Siraj: టీమిండియా తరఫున ఆడే హైదరాబాద్ స్టార్ క్రికెటర్, పేసర్ మహమ్మద్ సిరాజ్ తన హాస్యంతో కూడిన సమాధానాలతో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 విజేతల జట్టులో సభ్యుడైన సిరాజ్ ఇచ్చిన ఒక ఫన్నీ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో సిరాజ్‌ను జట్టు విజయంలో తనతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాత్ర గురించి ప్రశ్నించారు. దీనికి సిరాజ్ సరదాగా స్పందిస్తూ నవ్వులు పూయించాడు.

మా పని నీళ్లు పెట్టడం, బ్యాట్ అందివ్వడమే:  
ప్రెజెంటర్ మాట్లాడుతూ.. ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించవచ్చు కానీ మీ ఇద్దరి పాత్ర ఎంత ముఖ్యమని డీఎస్పీని అడిగాడు.. దీనికి సిరాజ్ సరదాగా స్పందిస్తూ.. మా పాత్ర చాలా పెద్దది.. బయట కూర్చుని ఆటగాళ్లకు వరుసగా నీళ్లు పెట్టడం, వారికి బ్యాట్లు అందజేయడం, నెట్స్ లో ప్రాక్టీస్ చేసే సమయంలో బౌలింగ్ చేయడమే మా పని అని చెప్పాడు. ఈ సమాధానం చెప్పిన వెంటనే సిరాజ్ కూడా నవ్వుకున్నాడు.

►ALSO READ | Team India: ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2027 ప్రపంచకప్ వరకు ఫుల్ బిజీ

ఈ విజయం టీమ్ క్రిడిట్ వల్లే:  
సిరాజ్ మాట్లాడుతూ.. ఈ విజయం మొత్తం క్రెడిట్ టీంకే చెందుతుందని చెప్పాడు. జట్టు ఏం నిర్ణయిస్తే అదే మంచిదని తాను నమ్ముతానని పేర్కొన్నాడు. నెట్‌లో బౌలింగ్ చేస్తాం.. టీమ్‌లో పాజిటివ్ వాతావరణం ఉంచుతాం.. ప్రతి ఆటగాడికి ఆడాలని ఉంటుంది.. కానీ టీమ్ కాంబినేషన్ కోసం బయట కూర్చోవాల్సి వస్తే, జట్టు ప్రయోజనం ఏమైనా చేస్తామన్నారు. ఇక్కడ వ్యక్తి కాదు, టీమ్ ముఖ్యమైంది అని తెలిపాడు.
 
ఇది దేవుడి స్క్రిప్ట్: 
మరో ప్రశ్నకు సమాధానంగా సిరాజ్ మాట్లాడుతూ.. మొదట తాను జట్టులో లేకపోయినా తర్వాత అకస్మాత్తుగా పిలుపు వచ్చిందని చెప్పారు. ఇది దేవుడి స్క్రిప్ట్‌.. చివరకు మేము ఛాంపియన్స్ అయ్యామని సిరాజ్ అన్నారు.