IND vs ENG 2025: సంతోషం.. అంతలోనే బాధ: క్యాచ్ పట్టి బౌండరీ టచ్ చేసిన సిరాజ్

IND vs ENG 2025: సంతోషం.. అంతలోనే బాధ: క్యాచ్ పట్టి బౌండరీ టచ్ చేసిన సిరాజ్

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ఫీల్డింగ్ లో చేసిన తప్పిదం కారణంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కాస్త పై చేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (23), బ్రూక్ (38) ఉన్నారు. 106 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కాసేపటికే బ్రూక్ వికెట్ తీసే అవకాశం వచ్చినా సిరాజ్ క్యాచ్ పట్టలేకపోయాడు. 

ఇన్నింగ్స్ 34 ఓవర్ తొలి బంతిని బ్రూక్ కు ప్రసిద్ కృష్ణ షార్ట్ బాల్ వేశాడు. మిడ్ వికెట్ గా బలంగా బాదడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వద్దకు క్యాచ్ వెళ్ళింది. మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ వెంటనే వెనకాలే ఉన్న బౌండరీని టచ్ చేశాడు. సిరాజ్ క్యాచ్ పట్టిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ సిరాజ్ బౌండరీ రోప్ టచ్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో సంతోషంగా ఉన్న ముఖాలు నిరాశకు గురయ్యాయి. ఈ క్యాచ్ సిరాజ్ పట్టి ఉంటే ఇంగ్లాండ్ 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పేయేది. 

Also Read :  ఇలా షాక్ ఇచ్చావేంటి హిట్ మ్యాన్

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రూక్ ఈ ఓవర్ లో 16 పరుగులు రాబట్టి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రూట్, బ్రూక్ కలిసి అజేయంగా 63 బంతుల్లోనే 58 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి 210 పరుగులు అవసరం. నాలుగో రోజు తొలి సెషన్ లలో ఇంగ్లాండ్ 114 పరుగులు రాబడితే టీమిండియా రెండు వికెట్లు పడగొట్టింది.