Rohit Sharma: ఇలా షాక్ ఇచ్చావేంటి హిట్ మ్యాన్: రూ.2.46 కోట్ల వాచ్ ధరించిన రోహిత్ శర్మ

Rohit Sharma: ఇలా షాక్ ఇచ్చావేంటి హిట్ మ్యాన్: రూ.2.46 కోట్ల వాచ్ ధరించిన రోహిత్ శర్మ

టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓవల్ టెస్ట్ చూడడానికి వచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం (ఆగస్టు 2) ఉదయం లండన్‌లోని ది ఓవల్‌లో కనిపించిన రోహిత్ మూడో రోజు ఆటకు హాజరయ్యాడు. చాలా సింపుల్ డ్రెస్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని రిలాక్స్‌గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు హిట్ మ్యాన్ కు చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. జైశ్వాల్ సెంచరీ కొట్టిన తర్వాత చప్పట్లు కొడుతూ భారత యువ జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. 

ఓవల్ టెస్టుకు రోహిత్ శర్మ రావడం ఒక విశేషమైతే.. హిట్ మ్యాన్ తన చేతికి పెట్టుకున్న వాచ్ మరొక విశేషం. సెలెబ్రిటీలు భారీ వస్తువులను కొనడం.. ధరించడం చాలా కామన్. కానీ రోహిత్ శర్మ వాచ్ ఖరీదు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఓవల్ టెస్టుకు రోహిత్ శర్మ టైటానియం వాచ్ ధరించాడు. దీని ధర అక్షరాలా 2.46 కోట్లు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదైనా హిట్ మ్యాన్ తన వాచ్ తో ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేశాడు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.  

Also Read : రసవత్తరంగా ఓవల్ టెస్ట్

స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో కోల్పోవడం హిట్ మ్యాన్ టెస్ట్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు బ్యాటింగ్ లో పేలవ ఫామ్ అతని రిటైర్మెంట్ కు కారణమైంది. రోహిత్‌శర్మ టెస్ట్ క్రికెట్ లో 67 టెస్టుల్లో 4,301 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇకపై కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు.  

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (23), బ్రూక్ (38) ఉన్నారు. ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి 210 పరుగులు అవసరం. నాలుగో రోజు తొలి సెషన్ లలో ఇంగ్లాండ్ 114 పరుగులు రాబడితే టీమిండియా రెండు వికెట్లు పడగొట్టింది.