IND vs ENG 2025: రసవత్తరంగా ఓవల్ టెస్ట్.. టీమిండియాకు అడ్డుకున్న రూట్, బ్రూక్

IND vs ENG 2025: రసవత్తరంగా ఓవల్ టెస్ట్.. టీమిండియాకు అడ్డుకున్న రూట్, బ్రూక్

ఓవల్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నాలుగో రోజు తొలి సెషన్ లలో ఇంగ్లాండ్ 114 పరుగులు రాబడితే టీమిండియా రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో రెండో సెషన్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (23), బ్రూక్ (38) ఉన్నారు. ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి 210 పరుగులు అవసరం. 

వికెట్ నష్టానికి 50 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి అరగంట సేపు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడింది. పోప్, డకెట్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో డకెట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లక్ష్యం వైపుగా దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ కు ప్రసాద్ కృష్ణ బిగ్ షాక్ ఇచ్చాడు. డకెట్ (54) ను ఔట్ చేసి టీమిండియాకు రెండో వికెట్ అందించాడు. కాసేపటికే  కెప్టెన్ పోప్ (27) ను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 106 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. 

Also Read : సచిన్, కోహ్లిలలో ఎవరు బెస్ట్.. డివిలియర్స్ సమాధానమిదే!

ఈ దశలో ఇంగ్లాండ్ ను రూట్, బ్రూక్ భాగస్వామ్యం నిలబెట్టింది. ఒక ఎండ్ లో రూట్ ఆచితూచి ఆడుతుంటే మరో ఎండ్ లో బ్రూక్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో వేగంగా పరుగులు వచ్చాయి. ప్రసిద్ బౌలింగ్ లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ సిరాజ్ బౌండరీ దగ్గర విదిచిపెట్టడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. ఇద్దరూ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. భారత బౌలర్లలో సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది.