
ఆదివారం (మే 25) చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 5 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 5 ఓవర్లో 5 బంతికి సిరాజ్ వేసిన బంతిని ఉర్విల్ పటేల్ మిడ్-ఆఫ్ వైపుకు ఆడి సింగిల్ తీశాడు. మిడాఫ్ లో ఉన్న గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ బంతిని తీసుకొని డైరెక్ట్ హిట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ గిల్ విసిరిన ఆ త్రో వికెట్లను తగలకుండా మిడ్‌వికెట్ వైపు వెళ్ళింది.
ALSO READ | GT vs CSK: మోత మోగించిన మాత్రే.. ఒకే ఓవర్లో 28 పరుగులతో రెచ్చిపోయిన 17 ఏళ్ళ కుర్రాడు
మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి కిషోర్ బంతిని ఆపడంలో విఫలమయ్యాడు. చెత్త ఫీల్డింగ్ తో చేతులోకి వచ్చిన బాల్ పట్టలేకపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాన్వే, ఉర్విల్ పటేల్ మూడు పరుగులు తీశారు. సాయి కిషోర్ చేసిన పనికి అసంతృప్తి చెందిన సిరాజ్.. బంతిని వికెట్ కీపర్ వైపు విసిరి కోపంగా తన నిరాశను వ్యక్తం చేశాడు. పరిస్థితిని గమనించిన గిల్ సిరాజ్ ను కూల్ చేశాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ ఓవరాల్ గా తన 4 ఓవర్ల స్పెల్ లో 47 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (మే 25) గుజరాత్ టైటాన్స్ పై మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బ్రేవీస్ (23 బంతుల్లో 57: 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కాన్వే (52) హాఫ్ సెంచరీకి తోడు ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) May 25, 2025