వైవీఎస్ చౌదరి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు

వైవీఎస్ చౌదరి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్ట్ బెయిల్ మంజేరు చేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. 2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్నప్పుడు..  ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం. `స‌లీమ్` అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో..  వైవిఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్ద‌నుకున్నాం.

సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్‌ కేసుని వేసి. కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. అయితే ఎర్రమంజిల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేశారు. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు` అని మోహన్ బాబు అన్నారు.