
తార్నాకలో ఏబీవీపీ ఆఫీస్‌ను ప్రారంభించనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
సికింద్రాబాద్, వెలుగు: తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్‌ను ప్రారంభించేందుకు గురువారం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ రానున్నట్టు ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం తార్నాకలో వారు మీడియాతో మాట్లాడారు. ఆఫీస్‌ను ప్రారంభించాక నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొంటారన్నారు. అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహన్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి కూడా పాల్గొంటారన్నారు. ఏబీవీపీ కోట్లాది మంది స్టూడెంట్లకు అభయహస్తమని, అనేక సమస్యలపై ఉద్యమాలు చేసి సమస్యలు పరిష్కరించిందన్నారు. సామాజిక అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తోందన్నారు. తార్నాకలో కొత్త ఆఫీస్ ఓపెనింగ్‌కు భారీగా తరలిరావాలని స్టూడెంట్స్‌కు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్తదితరులు పాల్గొన్నారు.