వేములవాడలో బూజు పట్టిన లడ్డూల అమ్మకం..ఘటనపై ఆరా తీసిన మంత్రి కొండా సురేఖ

వేములవాడలో బూజు పట్టిన లడ్డూల అమ్మకం..ఘటనపై ఆరా తీసిన మంత్రి కొండా సురేఖ

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బూజుపట్టిన లడ్డూలను అమ్మడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రసాద కౌంటర్‌‌లో లడ్డూలను కొనుగోలు చేశారు. అవి వాసన రావడం, బూజు పట్టి కనిపించడంతో వెంటనే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆఫీసర్లు పాడైన లడ్డూలను తొలగించారు.

 విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు లడ్డూ కేంద్రాన్ని సందర్శించి.. లడ్డూ తయారీ పట్ల ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ... లడ్డూ ప్రసాదం తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందజేస్తున్నామని చెప్పారు. 

కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లడ్డూ ఘ‌‌ట‌‌న‌‌పై మంత్రి సురేఖ ఆరావేములవాడ రాజన్న ఆలయంలో బూజు పట్టిన లడ్డూల అమ్మకం ఘటనపై మంత్రి కొండా సురేఖ అరా తీశారు. ఘ‌‌ట‌‌న‌‌కు సంబంధించిన అన్ని వివరాలను అందజేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. లడ్డూ ఘటనపై ఫుడ్‌‌ సేఫ్టీ ఆఫీసర్లకు లెటర్‌‌ రాసినట్లు ఈవో మంత్రికి వివరించారు.