దేశంలో సంపదను సృష్టించేది వైశ్యులే

దేశంలో సంపదను సృష్టించేది వైశ్యులే

దేశంలో సంపదను సృష్టించేది వైశ్యులేనని, దాన్ని వాళ్లే సమాజానికి అందిస్తారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12  అగ్రసేన్ చౌక్ లో ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్, అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్రసేన్ మహరాజ్ 5146వ  జయంతి ఉత్సవాలకు బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు హోంమంత్రి మహమూద్ ఆలీ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్, మరికొందరు వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం మహరాజ్ అగ్రసేన్ విగ్రహానికి నివాళి అర్పించిన బండారు దత్తాత్రేయ....అగ్రసేన్ మహారాజ్ కు హర్యానాలోనూ విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వైశ్యులు సమాజ సేవలో ముందు ఉంటారన్న ఆయన... అత్యధికంగా జీఎస్టీ చెల్లించేది కూడా వైశ్యులేనని చెప్పారు.  డబ్బులు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యమని, అగ్రసేన్ మహరాజ్ అహింసతో పోరాటం చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే సంఘి టెంపుల్ ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.