తెలంగాణ బడ్జెట్ రూ.3, 24, 234 కోట్లు

తెలంగాణ  బడ్జెట్ రూ.3, 24, 234 కోట్లు

తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతోందని అన్నారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శుక్రవారం (మార్చి 20) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తెలంగాణ బడ్జెట్ రూ.3, 24, 234 కోట్లు గా ప్రకటించారు. తెలంగాణ వద్ధి రేటు10.7 శాతంతో జాతీయ వృద్ధి రేటుకంటే 2.7 శాతం అధికంగా ఉన్నట్లు చెప్పారు. 

తెలంగాణ దేశానికి గ్రోత్ ఇంజిన్  నిలుస్తుందన్నారు భట్టి. దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతున్నా.. తెలంగాణ పెరగటం శుభసూచకమన్నారు.  తెలంగాణ ఆచరిస్తున్న విధానాలు.. అభివృద్ధికి తోడ్పడుతున్నాయి అనటానికి ఇదే నిదర్శనం అని కొనియాడారు.

ఇక తెలంగాణ తలసరి ఆదాయం.. 4 లక్షల 18 వేలుగా ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా రెవెన్యూ వ్యయం 2 లక్షల  34 వేల 406 రూపాయలు ఉన్నట్లు తెలిపారు.  మూలధన వ్యయం 47 వేల 267 కోట్ల రూపాయలు గా ఉన్నట్లు చెప్పారు. 

బడ్జెట్ వివరాలు:

తెలంగాణ  బడ్జెట్ రూ.3, 24, 234 కోట్లు
మూలధన వ్యయం రూ.47 వేల 267 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 34 వేల 406 కోట్లు
తెలంగాణ వృద్ధి రేటు 8 శాతం.. దేశం సగటు కంటే 2 శాతం అధికం
10.7 శాతానికి పెరిగిన తెలంగాణ జీడీపీ వృద్ధి
తెలంగాణ తలసరి ఆదాయం.. 4 లక్షల 18 వేలు