తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శుక్రవారం (మార్చి 20) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యత శాఖలకు భారీ కేటాయింపులు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు బడ్జెట్ ఆధారంగా తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు తిప్పికొట్టేలా ఆరు గ్యారెంటీలకు భారీగా కేటాయింపులు చేశారు. ఆరు గ్యారెంటలకు రూ.50 వేల 713 కోట్ల కేటాయింపులు చేశారు. అదే విధంగా ప్రభుత్వం విద్యపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు విద్య, మానవ వనరులకు రూ.26 వేల 674 కోట్లు కేటాయించింది.
వివిధ శాఖలకు, స్కీమ్ లకు కేటాయింపుల వివరాలు:
- మహాలక్ష్మి పథకానికి రూ.4 వేల 305 కోట్ల కేటాయింపులు
- వడ్ల బోనస్కు రూ.3 వేల 500 కోట్లు
- చేయూత పథకానికి రూ.14 వేల 861 కోట్లు
- ఇందిరమ్మ ఇళ్ల స్కీంకు బడ్జెట్లో రూ.5 వేల 500 కోట్ల కేటాయింపులు
- మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖకు రూ.15 వందల 29 కోట్లు
- రైతు భరోసాకు రూ.18 వేల కోట్ల కేటాయింపులు
- పౌర సరఫరాల శాఖకు రూ.7 వేల 366 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమం రూ.3 వేల 143 కోట్లు
- కార్మిక శాఖకు రూ.998 కోట్ల కేటాయింపు
- వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్లో రూ.13 వేల 679 కోట్ల కేటాయింపు
- విద్య, మానవ వనరులకు రూ.26 వేల 674 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ.21 వేల 285 కోట్ల కేటాయింపులు
- టూరిజం రంగానికి రూ.12 వందల 24 కోట్లు
- గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల కేటాయింపు
- లా అండ్ ఆర్డర్ రూ.11 వేల 907 కోట్లు
- మున్సిపల్ శాఖకు రూ.17 వేల 907 కోట్లు
- న్యాయ శాఖకు రూ.2 వేల 367 కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి రూ.2 వేల 654 కోట్లు
- రవాణా శాఖకు రూ.12 వేల 789 కోట్లు
- సాగు నీటి ప్రాజెక్టులకు రూ.22 వేల 615 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33 వేల 688 కోట్ల కేటాయింపులు
- చేనేత రంగం రూ.258 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.3 వేల 490 కోట్ల కేటాయింపులు
- ఐటీ శాఖకు రూ.875 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు రూ.7 వేల 430 కోట్లు
- రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
- మైనార్టీ సంక్షేమం రూ.3 వేల 769 కోట్లు
- BC సంక్షేమ శాఖకు రూ.12 వేల 511 కోట్లు
- ST సంక్షేమ శాఖకు రూ.7 వేల 937 కోట్లు
- SC సంక్షేమ శాఖకు రూ.11 వేల 784 కోట్లు
