ఆధ్యాత్మికం : జూన్ 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు.. కర్కాటక రాశిలోకి గురుడు..!

ఆధ్యాత్మికం : జూన్ 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు.. కర్కాటక రాశిలోకి గురుడు..!

యమునా నది పుష్కరాలు బృహస్పతి (గురుడు) కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పవిత్ర ఉత్సవం. 2026లో ఈ పుష్కరాలు జూన్ 2 నుండి జూన్ 13 వరకు, 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ కాలంలో యమునా నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం వల్ల పాపాలు తొలగి, పుణ్యం లభిస్తుందని పురాణాలా ద్వారా తెలుస్తుంది.  ఈ పుష్కరాల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. . .!

ఈ సంవత్సరం ( 2026)  యమునా పుష్కరాలు 01.06.2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:30ని॥లకు సార్థత్రికోటి సహిత యమునా నదీ పుష్కర ప్రవేశము, మంగళవారం జూన్ 02, 2026 అరుణోదయ వేళ నుండి పుష్కర స్నానారంభము. యమునా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి గురువు (బృహస్పతి) కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి జరిగే పవిత్రమైన జాతర 2026 జూన్ 02 నుండి 13 వరకు (12 రోజులు) జరుగుతుంది.

యమునా నది పుష్కరాల  పన్నెండు రోజులలో యమునా నదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి, జపదాన తర్పణ పిండ ప్రదానాదులు చేయుట వలన పితృ దేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగజేయుదురని తెలియుచున్నది. అదేవిధంగా పుష్కరాల సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మరణ భయం నుండి విముక్తి లభిస్తుందని పురాణ గాధ. హిందూ పురాణాల ప్రకారం యమునా నదిని సూర్య దేవుడు (సూర్యుడు) కుమార్తెగా, మృత్యుదేవత అయిన యమునిసోదరిగా భావించి పూజిస్తారు.

అందుకే యమునాజీ అని కూడా పిలుస్తారు. యమునా నది ఉత్తరాఖండ్, హర్యానా, మథుర, బృందావన్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ (సంగమం) మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. యమునా నది జన్మస్థానం (ఉత్తరాఖండ్) మథుర మరియు బృందావన్ శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ప్రదేశాలు. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) గంగా, యమునా, సరస్వతి సంగమం. ఢిల్లీ మరియు పౌంటా సాహిబ్ (హిమాచల్రదేశ్) ప్రధాన పుష్కర ఘూట్లు రద్దీగా ఉంటాయి.

ముఖ్యమైన ప్రదేశాలు

  •  ప్రయాగ్‌రాజ్ (త్రివేణి సంగమం)
  •  మధుర (విశ్రమ్ ఘాట్)
  •  బృందావన్ (కేశి ఘాట్)
  •  ఆగ్రా ఘాట్‌లు 

ప్రాముఖ్యత: యమునా నదిని సూర్య దేవుని కుమార్తెగా, యముని సోదరిగా భావిస్తారు. ఈ 12 రోజుల్లో నదీ స్నానం, దానధర్మాలు, పితృ తర్పణాలు అత్యంత ఫలప్రదంగా భావిస్తారు.

ప్రత్యేకత: ఈ పుష్కరాలు గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వస్తాయి, ఇది పన్నెండు పవిత్ర నదుల పుష్కరాల క్రమంలో భాగం. 

ముఖ్యమైన ఆచారాలు ఇవే..! 

నదీ స్నానం: ఉదయం స్నానమాచరించడం శ్రేష్ఠం
దానాలు: యధాశక్తిగా దానాలు (అన్నదానం, వస్త్రదానం) చేయడం.ః
పూజలు: విశేష పూజలు, జపాలు నిర్వహించడం