హైదరాబాద్ లో ఒక్క నెలలోనే ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా.. ? 3 వేల మందికి పైగా దొరికిపోయారు..

హైదరాబాద్ లో ఒక్క నెలలోనే ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా.. ? 3 వేల మందికి పైగా దొరికిపోయారు..

హైదరాబాద్ లో జూన్ నెలకు సంబంధించి డ్రంక్ డ్రైవ్ కేసుల వివరాలు వెల్లడించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో నిర్వహించిన ద్రుంక్ అండ్ డ్రైవ్ లో సుమారు 3 వేల 353 మంది వాహనదారులు పట్టుబడ్డట్టు తెలిపారు పోలీసులు. పాత కేసులు కూడా కలుపుకొని జూన్ నెలలో 5 వేల 321 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డవారిలో 133 మందికి జైలు శిక్ష కూడా పడినట్లు తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటిదాకా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు గాను కోర్టు రూ. 1 కోటి 4 లక్షల 87 వేల 600 ఫైన్ విధించినట్లు తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో ఎక్కడిక్కక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూన్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 

మద్యం సేవించి వాహనం నడపడం మంచిది కాదని... మీ ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా కుటుంబాలు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.