అమెరికా సిటిజన్స్ లో భారతీయులే సెకండ్ ప్లేస్

అమెరికా సిటిజన్స్ లో  భారతీయులే సెకండ్ ప్లేస్

ఉన్నత చదవుల కోసం, ఉపాధి కోసం భారత్ నుంచి విదేశాలకు వలసలు ప్రతి ఏడాది భారీగానే జరుగుతున్నాయి. అబ్రాడ్ వెళ్లి మంచి కంపెనీలో జాబ్ చేస్తే లక్షల్లో సంపాధించవచ్చని లక్ష్యంతో వేలల్లో విదేశాల బాట పడుతున్నారు. అయితే 2023 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన గణాంకాలను  US సిటిజన్ షిప్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విడుదల చేసింది. దీని లెక్కల ప్రకారం.. అమెరికాలో ఉన్న విదేశీయుల్లో ఇండియన్స్ రెండవ స్థానంలో ఉన్నారు. 

2023 సెప్టెంబర్ 30నాటికి ఆ దేశ ఫైనాషియల్ ఇయర్ పూర్తైంది. గత సంవత్సరంలో 59,000 మంది ఇండియన్స్ యూస్ వీసా పొందారట. అమెరికాలో సెట్టిలైయిన వారిలో అత్యధికంగా మెక్సికో నుంచి (12.7%) 1.1లక్షల మంది ఉన్నారు. 6.7శాతం మందితో సెకండ్ ప్లేస్ లో భారతీయులు ఉన్నారు. తర్వాత ఫిలిపిన్స్ 44,800 మంది దేశస్థులు మూడో స్థానంలో ఉన్నారు. నాల్గోవ స్థానంలో డొమనికన్ రిపబ్లిక్, 5వ స్థానంలో క్యూబా దేశాలు ఉన్నాయి. ఈ 5దేశాల జనాభానే 32శాతం మంది 2023లో అమెరికా సిటిజన్ షిప్ పొందారు.