పోటీ, పేరెంట్ల ఒత్తిడి వల్లే స్టూడెంట్ల సూసైడ్స్​.. సుప్రీంకోర్టు కీలక కామెంట్

పోటీ, పేరెంట్ల ఒత్తిడి వల్లే స్టూడెంట్ల సూసైడ్స్​.. సుప్రీంకోర్టు కీలక కామెంట్

న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వెనక తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే ప్రధాన కారణాలు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ముంబై డాక్టర్ అనిరుద్ధ నారాయణ్ మల్పాని దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్ వీఎన్ భట్టితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

తమకు పరిస్థితులు అర్థమవుతున్నాయని.. అయినప్పటికీ, ఇలాంటి వాటిపై న్యాయవ్యవస్థ ఆదేశాలు ఇచ్చేందుకు అవకాశం లేదని జడ్జిలు పేర్కొన్నారు. ఈ విషయంపై పిటిషనర్ తగిన సూచనలతో ప్రభుత్వాన్ని ఆశ్రయించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.