Asia Cup 2025 final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. అభిషేక్, పాండ్యా గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ అప్ డేట్

Asia Cup 2025 final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. అభిషేక్, పాండ్యా గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ అప్ డేట్

పాకిస్థాన్ తో మరి కాసేపట్లో జరగనున్న ఆసియా కప్ ఫైనల్ కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు ముందు ఇద్దరు భారత క్రికెటర్లు చిన్నపాటి గాయాలతో ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్ లో స్వల్ప గాయాలతో ఆట మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. దీంతో వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ ఆడతారా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. పాండ్య, అభిషేక్ గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మ్యాచ్ కు ముందు క్లారిటీ ఇచ్చాడు.

మోర్నీ మోర్కెల్.. పాండ్య గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాండ్య కొంత నొప్పితో ఇబ్బందిపడ్డాడు. 
మ్యాచ్ తర్వాత రోజు పాండ్యను పరీక్షించాం. హార్దిక్ బాగానే ఉన్నాడు. మ్యాచ్ లో ఆడతాడని భావిస్తున్నాం. మ్యాచ్ కు ముందు పాండ్యా ఫైనల్ ఆడతాడా లేదా అనే నిర్ణయం తీసుకుంటాం". అని చెప్పాడు.  అభిషేక్ గురించి మాట్లాడుతూ.. "అభిషేక్ బాగానే ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయం కాలేదు. కొద్ది సేపు తిమ్మిర్లతో బాధపడ్డాడు. పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడు".  అని మోర్కెల్ తెలిపాడు. 

►ALSO READ | Ind vs Pak ఫైనల్: వివాదాస్పదంగా మారిన PVR లైవ్ స్క్రీనింగ్.. శివసేన వార్నింగ్తో ఉత్కంఠ

ప్రస్తుతం టీంఇండియాలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య అత్యంత కీలక ప్లేయర్లు. వీరిద్దరూ జట్టులో లేకపోతే టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.  జట్టు విజయాల్లో యంగ్‌‌ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరు మ్యాచ్‌‌ల్లో 309 రన్స్‌‌తో టోర్నీ టాప్ స్కోరర్‌‌‌‌గా ఉన్న అతను 200 ప్లస్ స్ట్రయిక్ రేట్‌‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మరోవైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా జట్టులో ఉండడం చాలా కీలకం. కొత్త బంతితో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో పాండ్య ఫినిషర్ బాధ్యతలు సమర్ధవంతంగా స్వీకరించగలడు. అభిషేక్ మ్యాచ్ ఆడడం ఖాయమైనప్పటికీ పాండ్య ఆడడం కాస్త అనుమానంగా మారింది. ఒకవేళ పాండ్య గాయంతో దూరమైతే ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, బుమ్రాలతో టీమిండియా తుది జట్టు ఉంటుంది.