ఉదయం మండుటెండ.. రాత్రి జోరువాన..హైదరాబాద్​​లో మిక్స్​డ్​ వెదర్

ఉదయం మండుటెండ..  రాత్రి జోరువాన..హైదరాబాద్​​లో మిక్స్​డ్​ వెదర్

 హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో సోమవారం పగలంతా ఎండ దంచి కొట్టగా, రాత్రి వేళ జోరు వాన పడింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పనులుంటే ఉదయం 10 గంటల్లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత చేసుకుంటున్నారు. సూర్య ప్రతాపానికి సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త బ్రేక్​పడింది. 

రాత్రి 7 గంటల తర్వాత అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. హైటెక్​సిటీ, మియాపూర్, మూసాపేట, ఎల్లమ్మబండ, కూకట్​పల్లి, బాచుపల్లి, ప్రగతి నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అమీర్​పేటతోపాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 

చందానగర్, మాదాపూర్, ఆసిఫ్​నగర్, గోల్కొండ, రాజేంద్రనగర్​ఏరియాల్లో 3 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్వాల్, కొంపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. వర్షం పడిన ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు 34 డిగ్రీల వరకు ఉన్న టెంపరేచర్​కాస్తా 30 డిగ్రీలకు పడిపోయింది. దీంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.