దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం అధికం కాకపోయినా.. గత రెండు రోజులుగా నుంచి పరిస్ధితి దారుణంగా తయారైంది. అక్టోబర్ 29వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు వాయు నాణ్యత సూచిక (AQI) 390 వద్ద నమోదైంది, ఢిల్లీలోని ఆనంద్ విహార్‌తో సహా 16 చోట్ల AQI తీవ్ర స్థాయికి చేరుకుంది. తెల్లవారుజామున రోడ్లపై పొగ మంచు కమ్ముకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. అక్టోబర్ 29న నోయిడా లో 62 AQI 402 నమోదైంది.
ఘజియాబాద్‌లోని వసుంధరలో గాలి నాణ్యత 420కు చేరుకుంది. ఫరీదాబాద్‌లోని న్యూ ఇండస్ట్రియల్ టౌన్‌లో AQI 446గా నమోదైంది. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఇండియా గేట్ వద్ద వాకింగ్ చేసేవారు, సైక్లిస్టులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాము గురుగ్రామ్ నుంచి వచ్చామని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
