Viswam Movie: గోపిచంద్ విశ్వం.. క్రేజీగా ఫస్ట్‌ లిరికల్ సాంగ్‌

Viswam Movie: గోపిచంద్ విశ్వం.. క్రేజీగా ఫస్ట్‌ లిరికల్ సాంగ్‌

గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వం’.  కావ్యా థాపర్ హీరోయిన్. టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. బుధవారం ‘మొరాకన్ మగువా’ అనే పాటను విడుదల చేశారు.

చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను పృథ్వీ చంద్ర, సాహితి ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాడారు. ‘‘చుర చుర చూపుల నైన.. కొరకొర మెరుపుల వాన.. జరజర దిల్ మే తు ఆనా.. మిల్తేనా, సుల్తానా.. ‘మొరాకన్ మగువ తనేనా.. మదిని ముంచినది తుఫానా.. సర సర నరముల వీణ..’ అంటూ తెలుగు, హిందీ,  ఇంగ్లీష్  పదాలను బ్లెండ్ చేస్తూ రాకేందు మౌళి లిరిక్స్ రాశారు.

గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా..ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.