ఫిఫా వరల్డ్​కప్​లో తొలిసారి క్వార్టర్​ ఫైనల్లోకి మొరాకో

ఫిఫా వరల్డ్​కప్​లో తొలిసారి క్వార్టర్​ ఫైనల్లోకి మొరాకో

దోహా:  గ్రూప్‌‌ దశలో క్రొయేషియాకు చెక్‌‌ పెట్టి, బెల్జియంను ఓడించి సంచలనం సృష్టించిన మొరాకో మరో సెన్సేషనల్ విక్టరీతో ఫిఫా వరల్డ్​కప్​లో తొలిసారి క్వార్టర్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్​లో మొరాకో పెనాల్టీ షూటౌట్​లో 3–0తో మాజీ చాంపియన్‌‌ స్పెయిన్​ను ఓడించింది.  చివరి నిమిషం ఉత్కంఠగా సాగిన పోరులో  మొరాకో తరఫున అబ్దెల్లామిడ్​ సబిరి, హకీమ్​ జయెచ్‌‌​, అక్రాఫ్​ హకిమి.. పెనాల్టీ షుటౌట్​లో గోల్స్​ సాధించారు.  స్పెయిన్‌‌ మూడు ప్రయత్నాల్లోనూ ఫెయిలవడంతో టోర్నీ నుంచి షూటౌట్‌‌ అయ్యింది. పాబ్లో, సోలెర్‌‌, బాస్కెట్స్‌‌ కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకున్న  గోల్​ కీపర్​ యాసిన్​ బౌనౌ మొరాకోను కార్టర్స్​ చేర్చాడు.  

మ్యాచ్​ రెగ్యులర్​ టైమ్​లో ఇరు జట్లూ గోల్​​ చేయలేకపోయాయి.  బాల్​ను ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకున్న స్పెయిన్​ లాంగ్​ పాస్​లతో గోల్స్​ కోసం ప్రయత్నించింది. దీంతో ఒత్తిడిని జయించేందుకు మొరాకో చాలా టైమ్​ తీసుకుంది.  తర్వాత కౌంటర్​ ఎటాక్​ చాన్సెస్​ కోసం పోరాడి విఫలమైంది. ఎక్స్​ ట్రా టైమ్​లో ఇరుజట్లు పదునైన దాడులు​ చేసినా గోల్​​ కొట్టలేకపోయాయి. విన్నర్​ను తేల్చేందుకు షూటౌట్‌‌నిర్వహించగా.. అక్కడ తేలిపోయిన 2010 చాంపియన్‌‌ స్పెయిన్‌‌ వరుసగా మూడుసారి క్వార్టర్‌‌ ఫైనల్‌‌ చేరడంలో ఫెయిలైంది.