రష్యాపై డ్రోన్లతో దాడి...ఉక్రెయిన్ పనేనా..!

రష్యాపై డ్రోన్లతో దాడి...ఉక్రెయిన్ పనేనా..!

రష్యా  రాజధాని మాస్కోలో జులై 30వ తేదీ ఆదివారం మూడు డ్రోన్లు బీభత్సం సృష్టించాయి. మాస్కో ఎయిర్ పోర్టే లక్ష్యంగా డ్రోన్లు దాడులు చేశాయి. డ్రోన్లపై  రష్యా కూడా ప్రతిదాడి చేసింది. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ ద్వారా పలు డ్రోన్లను కూల్చివేసింది. అటు డ్రోన్ల దాడిలో ఎయిర్ పోర్టులోని రెండు బిల్డింగ్ లు దెబ్బతిన్నాయి.  అయితే డ్రోన్ల దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఉక్రెయిన్ దేశమే మాస్కో ఎయిర్ పోర్టుపై దాడి చేసినట్లు రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం డ్రోన్లతో ఉగ్ర దాడికి యత్నించిందని మండిపడింది. అయినా కూడా రష్యా డ్రోన్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొందని...రష్యా ఎలక్ట్రానిక్‌ వార్ఫెర్‌ వ్యవస్థ దెబ్బకు డ్రోన్లు  నియంత్రణ కోల్పోయి రెండు భవనాలపై కూలిపోయాయని రష్యా  రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో రెండు ఆఫీస్‌ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని పేర్కొంది.  

ఉక్రెయిన్ రష్యా సరిహద్దులకు దాదాపు 500 కి. మీ దూరంలోని మాస్కోపై   డ్రోన్లు దాడి చేయడంతో ఆ దేశ సైన్యం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేశారు. మాస్కోకు వచ్చే  విమానాలను దారి మళ్లించారు. గంట తర్వాత విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.