
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబెర్ గా ఉన్న సుజాతక్క శనివారం, ( సెప్టెంబర్ 13 ) పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన.. 1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. సుజాతక్క మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతతో పాటు మరికొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
గద్వాల ప్రాంతానికి చెందిన సుజాతక్క మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు కావడం గమనార్హం.2011లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ భార్య సుజాతక్క. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ సౌత్ ప్రాంతానికి సబ్ జోనల్ బ్యూరో ఇంఛార్జిగా ఉన్నారు సుజాతక్క.
సుజాతక్కపై రూ. కోటి రివార్డ్ ఉన్నట్లు సమాచారం. మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న సుజాతక్కతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు డీజీపీ జితేందర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం వెల్లడిస్తారని సమాచారం.