ఒకే ఇంట్లో తల్లీకొడుకు సూసైడ్..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌లో విషాదం 

ఒకే ఇంట్లో తల్లీకొడుకు సూసైడ్..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌లో విషాదం 

అబ్దుల్లాపూర్​మెట్,వెలుగు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య, తండ్రి లేడన్న మనస్తాపంతో కొడుకు ఒకే ఇంట్లో ఉరేసుకుని సూసైడ్​చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండల పరిధిలోని లష్కర్‌‌గూడలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కనకదుర్గ కాలనీకి చెందిన పూసల కళావతి (40) టైలరింగ్ చేస్తుండగా, ఆమె కుమారుడు శివకుమార్‌‌ (20)  డిగ్రీ పూర్తి చేసి దొరికిన పని చేస్తున్నాడు.

ఆరు నెలల కింద కళావతి భర్త కళాధర్ అనారోగ్యంతో మృతి చెందడంతో  తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన శివకుమార్ ఇంట్లోని ఫ్యాన్‌‌కు ఉరేసుకోగా, కొడుకు మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కళావతి అదే చీరతో పక్కనే ఉరేసుకుంది.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల్లోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కనకదుర్గ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.