
నవమాసాలు మోసీ, కనిపెంచిన కన్నతల్లే.. తన కొడుకుపై దాడిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరులో సోమవారం రాత్రి జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ తల్లి.. కొడుకుపై పైశాచికంగా దాడిచేసింది. బ్లేడుతో కన్న కొడుకు తొడలపై విచక్షణారహితంగా కోసింది. దాంతో బాలుడు అరుపులు పెట్టడంతో.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి తల్లిని అడ్డుకొని బాలుడిని కాపాడారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. బాలుడిని ఆస్పత్రికి తరలించి.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు.