ఎంత పని చేశావ్ తల్లి: బాలా నగర్‎లో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

ఎంత పని చేశావ్ తల్లి: బాలా నగర్‎లో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‎లోని కృష్ణ జిల్లా నూజివీడుకు చెందిన సాయి లక్ష్మి(27) భర్త పిల్లలతో కలిసి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మ నగర్ ఫేస్1లో నివాసముంటుంది. ఏమైందో తెలియదు కానీ.. మంగళవారం (అక్టోబర్ 14) తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది.

 ఆ తర్వాత మూడో అంతస్తు నుంచి దూకి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాయి లక్ష్మి పిల్లలు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కవలు కావడం గమనార్హం. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

.