
బాల్యం అనేది జీవితంలో అత్యంత అమూల్యమైన దశ. కానీ ఇళ్లు లేదా కుటుంబాలు లేని వారికి ఇది భయంకరమైన సవాళ్లను విసురుతుంది. అత్యధిక జనసాంద్రత కలిగిన భారతదేశంలో, అనాథలుగా లేదా నిరాశ్రయులైన వ్యక్తులుగా కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పిల్లల చాలా మందే ఉన్నారు. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో నెటిజన్స్ హృదయాలను ఆకర్షిస్తోంది. ఇది తల్లి, ఆమె బిడ్డ మధ్య అచంచలమైన బంధాన్ని ప్రదర్శిస్తుంది.
“ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ ఉండరు” అని కేజీఎఫ్ మూవీలో హీరో చెప్పినట్టు.. ఈ డైలాగే కల్పితం కాదు ఒక స్పష్టమైన వాస్తవికత. ఒక తల్లి తన పిల్లల కోసం ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటుంది. ఎంతటి త్యాగాన్నైనా చేస్తుంది. తన బిడ్డల శ్రేయస్సును కోరి.. కష్టాలతో పోరాడుతూ.. రోడ్డు పక్కన పండ్ల దుకాణాన్ని నిర్వహించడమే కాకుండా, తన పిల్లలకు విద్యను కూడా నేర్పిస్తూ జీవితంలో పోరాడుతున్న ఓ తల్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది,
ALSO READ :లవ్ గురూ.. గతం తాలూకా ఆలోచనలతో ఎన్నాళ్లిలా.. బ్రేకప్ నుంచి తొందరగా బయటపడాలంటే
ఈ వీడియోను జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేయగా, దీనికి ఇప్పటివరకు 1లక్షా 2వేల వ్యూస్ వచ్చాయి. ఆర్థికంగా ఒత్తిడికి గురైన ఈ మహిళ.. తన పిల్లల చదువుల కోసం రోడ్డు పక్కన పండ్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ వీడియోలో చిత్రీకరించబడింది. ఆమె ఎదుర్కొనే పోరాటాలతో పాటు తన పిల్లలను రక్షించాలనే ఆమె అచంచలమైన సంకల్పం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ వీడియోలో ఆమె తన పిల్లలతో కలిసి కూర్చుని, వారికి చదువు చెప్పే హృద్యమైన దృశ్యాలు ఉన్నాయి. ఆమె పక్కనే KA లైసెన్స్ ప్లేట్‌తో వాహనం ఉండటం కర్ణాటకకు కనెక్షన్‌ని సూచిస్తున్నప్పటికీ, ఆ ప్రదేశం ఎక్కడ అన్నది మాత్రం తెలియరాలేదు.
ఈ వీడియో సోషల్ మీడియా యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె అచంచలమైన నిబద్ధతకు సెల్యూట్, "తల్లిని మించిన గొప్ప యోధుడు లేడు" అని పలు కామెంట్లతో యూజర్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
आज कैप्शन के लिये मेरे पास शब्द ही नहीं हैं..!!
— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 29, 2023
?#मां #Respectfully ? pic.twitter.com/8A3WEFmAMg