ప్రేమ విఫలం తర్వాత.. త్వరగా ఇలా బయటపడొచ్చు..

ప్రేమ విఫలం తర్వాత..  త్వరగా ఇలా బయటపడొచ్చు..

జీవితభాగస్వామిగా ఊహించుకున్న వ్యక్తి బ్రేకప్ చెప్పినప్పుడు మనసంతా బాధగా ఉంటుంది. బ్రేకప్... ఎవరు.. చెప్పినా దాని ప్రభావం రిలేషన్ ప్ లో ఉన్న ఇద్దరి మీదా పడుతుంది. అయితే కొందరు గతం తాలూకా ఆలోచనల నుంచి తొందరగానే బయట పడతారు. కానీ, కొందరి వల్ల కాదు. ప్రతీక్షణం పాత రోజుల్ని తలచుకుంటుంటారు. దాంతో వాళ్లలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దేని మీదా ఫోకస్ ఉండదు. ఇలాంటి ఇబ్బంది రాకూడదంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకు ఏం చేయాలో చెప్తున్నారు మెంటల్ హెల్త్ కౌన్సెలర్ అరౌబ కబీర్.

బ్రేకప్ అయినంక..

గొడవలు వచ్చినప్పుడు.. కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని బ్రేకప్ చెప్పేస్తారు కొందరు. వాళ్లు అలా చెప్పడంతో 'పరిస్థితులు సర్థుకుంటాయిలే అనుకునేవాళ్లకు ఏం చేయాలో తోచదు. దాంతో 'ఎందుకిలా జరిగింది? అనే ఆలోచనలు వాళ్ల బుర్రలో తిరుగుతుంటాయి. ఆ టైంలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి. దాంతో కొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకని నెగెటివ్ ఆలోచనల్ని రానీయొద్దు..

బ్రేకప్ నుంచి తొందరగా బయటపడాలంటే ఏదో ఒక పనితో బిజీ అవ్వాలి. అంతేకాదు ఎమోషన్స్ ని అణచిపెట్టుకుంటే బ్రేకప్ బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. దిగులుతో ఒంటరిగా ఉండకుండా దోస్తులతో మాట్లాడాలి. మానసిక ఒత్తిడి తగ్గడానికి ఫ్రెండ్స్ తో గడిపే టైం టానిక్ లా పనిచేస్తుంది. ఇంట్లోవాళ్లతో ఎక్కువ టైం ఉండాలి. అప్పటికీ కూడా ఒత్తిడి అలానే ఉంటే థెరపిస్ట్ ని కలవాలి.

Also Read: ఏం గుండె అమ్మ నీది : చావటానికి ముందు.. గ్రాండ్ గా మందు పార్టీ ఇచ్చింది

బాధగా ఉన్నప్పుడు మనసుకి సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలి. పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం హాబీగా ఉన్నవాళ్లు వాటిని కంటిన్యూ చేయాలి.పెంపుడు జంతువులని వాకింగ్ కి తీసుకెళ్లడం, వాటితో ఆడుకోవడం వంటివి చేయాలి. ఇవేకాకుండా.. ఎవరితో మాట్లాడితే మనసు తేలికపడుతుంది అనిపిస్తుందో వాళ్లతో మాట్లాడాలి. ఇలాచేస్తే మునపటిలా ఉత్సాహంగా ఉంటారు.