కోపంతో…కన్న బిడ్డలను కడతేర్చింది

కోపంతో…కన్న బిడ్డలను కడతేర్చింది

భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డలను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గోదావరిఖని, సప్తగిరి కాలనీలో రమాదేవి,శ్రీకాంత్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి అజయ్, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త విధుల్లో భాగంగా నైట్ డ్యూటీ కి వెళ్లాడు. ఉదయం వచ్చేప్పుడు శివరాత్రి పూజా సామాగ్రి తేవాల్సిందిగా భర్తకు చెప్పింది రమాదేవి. స్కూలుకు సెలవు కావడంతో ఇద్దరు కుమారులు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు. ఎంత వారించినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి…తన మాటను లెక్క చేయడం లేదంటూ  ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్‌(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్య పరిస్థితి విషమంగా ఉంది. ఆర్యన్ ను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆర్యన్ కూడా చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.