
మోటరోలా మోటో జీ73 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇది 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ధర రూ.19 వేలు. ఈ నెల 16 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్, 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వెనుకవైపు డ్యూయల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ కెమెరా, 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, ఐపీ52 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్, 5జీ కనెక్టివిటీ, ఎన్ఎఫ్సీ వంటివి ఇతర ఆకర్షణలు.
ఫ్లిప్‌ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో ఇండియా మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘ఫైండ్ ఎన్2 ఫ్లిప్’ను లాంచ్ చేసింది. దీని ధర రూ.90 వేలు. ఈనెల 17 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. క్యాష్‌బ్యాక్, ఆఫర్ల ద్వారా రూ.80 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.8- అంగుళాల డిస్‌ప్లే, 3.26 ఇంచుల కవర్ స్క్రీన్, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్,- 44 వాట్ల సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
స్టూడెంట్ల కోసం హెచ్‌పీ క్రోమ్‌బుక్
పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటర్ కంపెనీ హెచ్‌పీ స్టూడెంట్ల కోసం - "క్రోమ్‌బుక్ 15.6"ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. ధరలు రూ. 28,999 నుంచి మొదలవుతాయి. ఇందులో ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 15.6 ఇంచుల స్క్రీన్, 11.5 గంటలపాటు బ్యాటరీ లైఫ్, గూగుల్ క్లాస్ రూమ్, వై-ఫై 6, డ్యూయల్ స్పీకర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.