టూల్స్ గాడ్జెట్స్..మౌంట్ ఛార్జర్‌‌ 

టూల్స్ గాడ్జెట్స్..మౌంట్ ఛార్జర్‌‌ 

మౌంట్ ఛార్జర్‌‌ 

బైక్‌‌‌‌ రైడర్లు, డెలివరీ బాయ్స్‌‌ గూగుల్‌‌ మ్యాప్స్‌‌ ఎక్కువగా వాడుతుంటారు. బండి నడుపుతూ.. నావిగేషన్‌‌ చూసేందుకు హ్యాండిల్‌‌కు బైక్‌‌ మౌంట్‌‌ పెట్టి, దానికి ఫోన్ తగిలించుకుంటారు. అయితే.. అలా ఎక్కువ సేపు మొబైల్‌‌ వాడినప్పుడు ఛార్జింగ్ పెట్టే టైం ఉండదు. అలాంటప్పుడు బోబో మౌంట్‌‌ వాడితే సరిపోతుంది. ఇదిపెట్టుకుంటే ఒక పక్క ఫోన్ వాడుతూనే ఛార్జింగ్​ చేసుకోవచ్చు. ఇది మొబైల్‌‌ని హోల్డ్‌‌ చేయడమే కాకుండా కావాల్సినప్పుడల్లా ఛార్జింగ్​ కూడా చేస్తుంది. ఈ మౌంట్‌‌లో ఇన్‌‌బిల్ట్‌‌ డీసీ ఛార్జర్ ఉంటుంది. కనెక్ట్‌‌ చేసుకోవడానికి యూఎస్‌‌బీ పోర్ట్ ఉంటుంది. దీనికి ఉండే రెండు వైర్లను బైక్‌‌ బ్యాటరీకి కనెక్ట్‌‌ చేయాలి. ఛార్జర్‌‌‌‌ని కంట్రోల్‌‌ చేయడానికి ఆన్​/ఆఫ్​ బటన్‌‌ ఉంటుంది. ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0కి సపోర్ట్‌‌ చేస్తుంది. ఈ మౌంట్‌‌లో దాదాపు అన్ని రకాల ఫోన్లు పెట్టుకోవచ్చు. 4.0 నుంచి 7.0 అంగుళాల స్క్రీన్ ఉండే మొబైల్స్‌‌కి ఇది సరిపోతుంది. గ్రిప్‌‌ కూడా ఫర్ఫెక్ట్‌‌గా ఉంటుంది. 

ధర : 1,031 రూపాయలు

ఎలక్ట్రిక్‌ లైటర్‌‌

కొందరిళ్లలో నెలకో గ్యాస్‌‌‌‌ లైటర్‌‌‌‌ పాడవుతుంటుంది. చిన్న పిల్లలు ఉన్న ఇండ్లలో ఈ సమస్య ఎక్కువ. అలాంటివాళ్లు ఈ ఎలక్ట్రిక్‌‌ లైటర్‌‌‌‌వాడితే సరిపోతుంది. క్యాండిల్స్‌‌ వెలిగించడానికి ప్రత్యేకంగా అగ్గిపెట్టెలు కొనాల్సిన పని కూడా ఉండదు. దీంతో వాటిని కూడా వెలిగించొచ్చు. దీన్ని నెసాప్టో అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇందులో రీఛార్జబుల్‌‌ లిథియం బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌‌ ఛార్జింగ్​ చేస్తే.. దాదాపు 500 సార్లు వాడుకోవచ్చు. ఒకసారి ఆన్‌‌ చేస్తే.. 7 సెకన్లలో ఆటోమేటిక్‌‌గా  పవర్- ఆఫ్ అవుతుంది. ఇందులో షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్, ఓవర్‌‌లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. పిల్లలు వాడకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ స్విచ్ కూడా ఉంటుంది. లైటర్‌‌‌‌కు ఫ్లెక్సిబుల్ నెక్ ఉంటుంది. కాబట్టి 360 డిగ్రీలవైపు తిప్పుకోవచ్చు. ఎల్‌‌ఈడీ బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంది. దీన్ని ఫ్లేమ్‌‌లెస్ ఆర్క్ టెక్నాలజీతో తయారుచేశారు. బలమైన గాలి వచ్చినా ఈ లైటర్ క్యాండిల్‌‌ని వెలిగించగలదు. క్యాండిల్స్‌‌తోపాటు పటాసులు, గ్యాస్టవ్, క్యాంపింగ్ బార్బెక్యూలు వెలిగించడానికి బెస్ట్ ఛాయిస్‌‌. 

ధర: 438 రూపాయలు 

త్రీడీ యాక్రిలిక్ లైట్‌‌‌‌‌‌‌‌‌‌ 

క్రియేటివిటీని పెంచుకోవడానికి చాలామంది బొమ్మలు వేస్తుంటారు. కొందరు బొమ్మలతో గ్రీటింగ్స్‌‌‌‌ చెప్తుంటారు. అలాంటి వాళ్లకు ఈ గాడ్జెట్‌‌‌‌ యూజ్​ఫుల్​. లైట్-అప్ స్టాండ్‌‌‌‌తో కూడిన ఈ యాక్రిలిక్ డ్రై ఎరేజ్​ బోర్డ్‌‌‌‌ని ఇండిట్రెడిషన్‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. ఈ డివైజ్‌‌‌‌తోపాటు వచ్చే గ్లాస్‌‌‌‌ మీద వైట్‌‌‌‌ స్కెచ్‌‌‌‌(ప్యాకేజీలోనే వస్తుంది)తో బొమ్మలు గీసి, లేదంటే గ్రీటింగ్స్‌‌‌‌ రాసి, దాన్ని డివైజ్‌‌‌‌ మీద పెట్టి ఆన్‌‌‌‌ చేస్తే చాలు. బొమ్మ బ్రైట్‌‌‌‌గా వెలుగుతుంది. తర్వాత స్కెచ్‌‌‌‌ గీతల్ని తుడిపేసి మరో బొమ్మ గీసుకోవచ్చు. ఇల్లు, ఆఫీస్‌‌‌‌, రెస్టారెంట్, కెఫె, షాపులు, హోమ్ పార్టీలు.. ఇలా ఎక్కడైనా వాడుకోవచ్చు. దీన్ని నోటీస్‌‌‌‌ బోర్డ్‌‌‌‌గా కూడా వాడొచ్చు. బేస్ హోల్డర్‌‌‌‌పై ఇన్‌‌‌‌బిల్ట్‌‌‌‌గా 6 హై లుమినస్ ఎల్‌‌‌‌ఈడీ లైట్లు ఉంటాయి. దీన్ని యూఎస్‌‌‌‌బీ కేబుల్‌‌‌‌తో ఛార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. ప్యాక్‌‌‌‌లో యాక్రిలిక్ మెసేజ్ బోర్డ్, యూఎస్‌‌‌‌బీ కేబుల్‌‌‌‌,  లైట్ బేస్ హోల్డర్, వైట్ స్కెచ్ పెన్, ఎరేజ్ క్లాత్ వస్తాయి. 

ధర : 499 రూపాయలు 

అడ్జస్టబుల్‌ స్పూన్‌ 

వంట చేసేటప్పుడు పదార్థాల కొలతలు తప్పితే రుచే మారిపోతుంది. వంట చేయడంలో చేయి తిరిగినవాళ్లకైతే కొలతలు సరిగా తెలుస్తాయి. కానీ.. బిగినర్స్‌‌‌‌ చాలా ఇబ్బంది పడతారు. అలాంటివాళ్లు ఈ స్పూన్‌‌తో ఇంగ్రెడియెంట్స్‌‌ని ఈజీగా కొలవొచ్చు. దీన్ని జెనరిక్‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఖచ్చితమైన కొలత కోసం దీనికి ఉండే స్లయిడర్లను ముందు, వెనుకలకు జరపాలి. ఒక ఎంఎల్‌‌/గ్రాము నుంచి 13 ఎంఎల్‌‌/గ్రాము వరకు అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. డ్రై, లిక్విడ్, సెమీ లిక్విడ్.. ఇలా అన్ని రకాల పదార్థాలకు ఇది సూట్​ అవుతుంది. 

ధర : 222 రూపాయలు