
దాదాపు 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరోయిన్ విజయశాంతి.. త్వరలోనే ఆమె మళ్లీ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా సబ్జెక్ట్ నచ్చి నటించడానికి అంగీకరించారు.
సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినోత్సం సందర్భంగా ఇవాళ (శుక్రవారం) ఆ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. `సూపర్‌స్టార్ కృష్ణగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నా తెలుగు మొదటి సినిమా `కిలాడి కృష్ణుడు`లో హీరో సూపర్‌స్టార్ కృష్ణగారు. ఆ సినిమా తర్వాత 180 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించా. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ తో 2020 లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు గారి తో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద`ని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పటికీ సినిమాల పట్ల అదే గౌరవం, అంకిత భావం ఉందన్నారు.
దైవ సంకల్పమో, దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో ఈ నిర్ణయం. బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే తెలిసిన
మీ రాములమ్మ.విజయశాంతి.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 31, 2019