V6 News

రోలర్ కోస్టర్‌‌‌‌ లాంటి ఎమోషన్స్‌‌తో మోగ్లీ

రోలర్  కోస్టర్‌‌‌‌ లాంటి ఎమోషన్స్‌‌తో మోగ్లీ

‘బబుల్‌‌గమ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ, రాజీవ్  కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో  సినిమా ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శనివారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రోషన్ కనకాల చెప్పిన విశేషాలు. 

‘‘ఇదొక  ప్యూర్  ఇన్నోసెన్స్  లవ్ స్టోరీ.  ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ ప్రేమకథ చాలా హానెస్ట్‌‌గా  ఉంటుంది.  ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ రేసీ  స్క్రీన్‌‌ప్లే డిజైన్ చేశారు. ఇందులో కామెడీ, యాక్షన్ సహా  అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.  మోగ్లీ  తన ప్రేమ కోసం దేనికైనా రెడీగా ఉంటాడు. తన ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులను ఎలా అధిగమించాడనేది ఆర్గానిక్‌‌గా చూపించబోతున్నాం.

 మోగ్లీ క్యారెక్టర్ అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.  ఫారెస్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో షూటింగ్ చేయడంతో  ప్రాక్టికల్‌‌గా కొన్ని ఇబ్బందులు ఎదురైనా..  నేను అన్నీ ఎంజాయ్ చేస్తూ చేశాను. చేసే పనిని ప్రేమించి చేశాను.  హీరోయిన్ సాక్షి మడోల్కర్ ఈ సినిమా కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది.  మా ఇద్దరి కెమిస్ట్రీ పండితేనే కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.

 అలాంటి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. అలాగే విలన్‌‌గా బండి సరోజ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.  ఈ కథకి ఆయన పర్ఫెక్ట్‌‌గా సింక్ అయ్యారు.  -హర్ష  కూడా ఇందులో ఇంపాక్ట్‌‌ఫుల్ క్యారెక్టర్ చేశాడు. కథలో తన పాత్ర చాలా కీలకం. ఇంటర్వెల్,  ప్రీ ఇంటర్వెల్ చాలా ఎంగేజింగ్‌‌గా ఉంటుంది.  

 కాలభైరవ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తుంది. ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎమోషన్స్‌‌ను ఆడియెన్స్‌‌కు అందిస్తుంది.  ఇప్పటికే వేసిన ప్రీమియర్స్‌‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. విశ్వ ప్రసాద్ గారి సపోర్ట్‌‌తోనే సినిమా ఇంత గ్రాండ్‌‌గా వచ్చింది’’.