ముషీరాబాద్, వెలుగు: క్రీడల అభివృద్ధి, మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో రూ. 46 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన అధునాతన షటిల్ కోర్టును ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేస్తున్నామని, ముషీరాబాద్ నియోజకవర్గంలో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మాజీ కార్పొరేటర్ ఆర్. కల్పనా యాదవ్, ముఠా జైసింహ, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
