జీవన్ రెడ్డి అంకుల్ ఇవేం పనులు..

జీవన్ రెడ్డి అంకుల్ ఇవేం పనులు..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేశారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కరపత్రాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేపించారని ఆరోపించారు. ఇవేం పనులు అంకుల్ అంటూ కామెంట్ చేశారు. తన తండ్రి స్నేహితుడైన మీరు తనకు తండ్రి లాంటివారని మీరు కలిసిన ప్రతిసారి ఆశీర్వాదం తీసుకునేవాడినని చెప్పారు. దానిలో మీకు అహంకారం ఎక్కడ కనబడిందని ప్రశ్నించారు. కండ్లకు కూలింగ్ ఉంటదని కళ్ళద్దాలు పెట్టుకుంటానని తెలిపారు. 

బీజేపీకి ఎప్పుడు 3వేల నుంచి 4వేల ఓట్లు వచ్చేవని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ కు దీటుగా ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏ రేంజ్ లో వస్తాయో తెలుసుకోండని సూచించారు. 2014 నుండి ఇదే చివరి ఎలక్షన్ అనుకుంటూ ఇప్పటివరకు పోటీ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి అంకుల్ మీ ఇంటి సభ్యులు చేస్తున్న చిల్లర రాజకీయాలను ఆపించండని అర్వింద్ సూచించారు.