బడ్జెట్ అంటే తెలంగాణలో ఫ్యామిలీ ఫండ్

బడ్జెట్ అంటే తెలంగాణలో ఫ్యామిలీ ఫండ్

బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచి చౌకా కొడితే.. కేసీఆర్‎కు జట్కా తగిలి యశోదా ఆస్పత్రిలో చేరాడని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఆ జట్కా వల్లే అసెంబ్లీలో పూనకం వచ్చినట్లు మాట్లాడడని ఆయన ఎద్దేవా చేశారు.

‘బడ్జెట్ అనేది పబ్లిక్ ఫండ్ అని మా అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో మాత్రం అది ఫ్యామిలీ ఫండ్ అయింది. జీడీపీలో రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‎లో ఉందన్నారు. కానీ తెలంగాణ స్థానం ఏడు. కేసీఆర్ వచ్చాక జీడీపీ పెరగలే.. అప్పులు పెరిగాయి. కేసీఆర్ మొన్న ప్రకటించిన నోటిఫికేషన్లు.. బీజేపీ భయంతోనే చేశారు. కేసీఆర్‎కు మోడీ అంటే భయంపట్టుకుంది.  ‎కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం డబుల్ ఎందుకు అయిందో అడ్వైజరీ కమిటీకి చెప్పలేదు. అంతేకాకుండా డీపీఆర్ కూడా ఇవ్వలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు. బోర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పలేదు. పెట్టడం, పెట్టకపోవడం మీ ఇష్టం. ఏది ఏమైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్లను మీ పార్టీ కోసం ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. హిజాబ్ పేరుతో మతకలహాలు మీరు రేపుతున్నారు. విద్యార్థులకు యూనిఫాం ఉంటే.. అందరూ వేసుకోవాల్సిందే. బంగారు తెలంగాణ అని చెప్పి.. గంజాయి తెలంగాణగా మార్చారు. నీ బిడ్డకు పట్టిన గతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీ కొడుకుకు కూడా పట్టిస్తాం. ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ సిటీ అని అప్పుడెప్పుడో చెప్పిండు, కానీ ఇంతవరకు ఏం చేయలే? ’ అని అర్వింద్ అన్నారు.