వివేకా హత్య కేసులో నన్ను టార్గెట్ చేసిన్రు: ఎంపీ అవినాష్ రెడ్డి

వివేకా హత్య కేసులో నన్ను టార్గెట్ చేసిన్రు: ఎంపీ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకా హత్యకు సంబంధించి విచారణ పూర్తిగా ఏకపక్షంగా జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ కేసు విషయంలో తనను టార్గెట్ చేసి విచారణ చేస్తున్నారని సీబీఐ పై ఆరోపణలు చేశారు. మొదటిసారి విచారణకు హాజరైనప్పుడే తన దగ్గర ఉన్న సమాచారం ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు మరోసారి జరిగిన విచారణలో కూడా తన దగ్గర ఉన్న సమాచారాన్ని వెల్లడించానన్నారు. అలాగే.. అధికారుల సందేహాలపై వినతిపత్రం అందజేశానని చెప్పారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని తాను అధికారులను కోరానని.. కాని రికార్డ్ చేయలేదని ఎంపీ అవినాష్ అన్నారు. న్యాయవాదులను అనుమతించాలని కోరినా అందుకు సీఐబీ ఒప్పుకోలేదన్నారు. 

వివేకా చనిపోయిన రోజు మీడియాతో మొదట మాట్లాడిన వ్యక్తి తానే అని ఎంపీ అవినాష్ అన్నారు. ఇప్పటికీ తాను అదే స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. సీబీఐ అధికారులు తనను సాక్షిగా విచారిస్తున్నారో.. నేరస్తుడిగా విచారిస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. వివేకా మర్డర్ జరిగిన రోజు దొరికిన లెటర్ ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆ లేఖను బయటికి తీసుకురావాలని అధికారులను కోరుతున్నానని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.