కేసీఆర్ రాక కోసం వెయిట్ చేస్తున్నా: ఎంపీ చామల

 కేసీఆర్ రాక కోసం వెయిట్ చేస్తున్నా: ఎంపీ చామల

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నానని.. అయితే 2014, 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకుని ఆయన బయటికి రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎవరు ఏ పని చేశారు అనేది ప్రజల్లో చర్చ జరగాలన్నారు. గాంధీ భవన్ లో చామల మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ 2023 మేనిఫెస్టో తీసుకుని మేం బయటికి వస్తం. ఎన్నికల హామీలు అమలుపై యాదగిరిగుట్టలో చర్చ చేద్దాం. లేకపోతే కేసీఆర్ ఫాం హౌస్ దగ్గరకు రండి. విభజన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో అందరూ కలిసి రావాలి.

 చెరువుల పూడికతీత కోసం మిషన్ కాకతీయ తీసుకువచ్చారు. ఇప్పుడు చెరువులను కాపాడడం కోసం హైడ్రా తీసుకుని వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. సీడీఎఫ్ 10,000 కోట్లకు కమీషన్ తీసుకున్నారు. అందుకే రద్దు చేశాం. కన్స్ట్రక్షన్ లీగల్, ఇల్లీగల్ చూసుకోకుండా ఇల్లు ఎందుకు తీసుకున్నావు కేటీఆర్. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనందున కాలేజీలకు కొంత టైం ఇచ్చాం. హైడ్రాకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్న మాటలు యథాలాపమే. అపోజిషన్ అంటే ట్విట్టర్ వేదికగా పోస్టులు చేయడం అయ్యింది ఇప్పుడు’ అంటూ సెటైర్​వేశారు.